యాదగిరిగుట్ట: మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరికలు

యాదగిరిగుట్ట పట్టణంలోని గొంగిడి నిలయంలో మాజీ డిసిసిబి చైర్మన్, టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి సమక్షంలో మూటకొండూర్ మాజీ సర్పంచ్ వడ్డబోయిన శ్రీలత, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఆమెను ముటకొండూరు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బోట్ల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్