యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని యాదాద్రీశుడి సన్నిధిలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం నాగవల్లి దళార్చనలు శాస్త్రోక్తంగా జరిగాయి. విష్ణుపుష్కరిణి వద్దనున్న ఆలయంలో అర్చకులు పంచసూక్తాలు, మన్యు సూక్త పఠనాలతో స్వామికి అభిషేకించి, సింధూరం, వివిధ రకాల పూలతో అలంకరించి ఆకు పూజ నిర్వహించారు. ఈ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.