యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ద్వారాలు బుధవారం తెరుచుకున్నాయి. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు ఆలయాన్ని మూసివేశారు. గ్రహణం వీడిన తర్వాత, ఆలయ అర్చకులు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 8.45 గంటల నుంచి భక్తులకు ఉభయ దర్శనాలు అందుబాటులోకి రానున్నాయి.