యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఏకాదశి సందర్భంగా శనివారం ప్రత్యేక ఆరాధన నిర్వహించారు. మహాముఖ మండపంలో యజ్ఞమూర్తులను కొలుస్తూ లక్ష పుష్పార్చన జరిపారు. గంటన్నర పాటు కొనసాగిన ఈ క్రతువులో భక్తులు పాల్గొని ఆశీస్సులు పొందారు. దర్శనమూర్తులకు సువర్ణ పుష్పార్చన కూడా జరిగింది. కార్తిక శనివారం కావడంతో భక్త దంపతులు పెద్ద ఎత్తున పూజలు చేశారు.