యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి నిత్య ఖజానాకు గురువారం రూ. 17, 43, 745 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. ప్రధాన బుకింగ్, బ్రేక్ దర్శనాలు, విఐపి దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కార్ పార్కింగ్, వ్రతాలు, లీజుల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ ఆదాయంలో ప్రసాద విక్రయాల ద్వారా రూ. 6,25,645, కార్ పార్కింగ్ ద్వారా రూ. 2,02,000, లీజుల ద్వారా రూ. 2,73,020 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు.