యాదగిరిగుట్ట: యాదాద్రి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో పాటు వేసవి సెలవులు ముగుస్తుండటంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్