యాదగిరిగుట్ట: రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తా

యాదగిరిగుట్ట పిఏసీఎస్ చెర్మెన్ ఇమ్మిడి రాంరెడ్డి, రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన మరోసారి యాదగిరిగుట్ట పిఏసీఎస్ చెర్మెన్ గా బాధ్యతలు చేపట్టారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక సహకార సంఘం యాదగిరిగుట్ట స్థాయి రైతుల సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వం పిఏసీఎస్ పాలకవర్గం నియామకానికి ఎన్నికలు జరపకుండా అధికారుల పాలన ఏర్పాటు చేయాలనుకోవడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. అధికారుల పాలనపై కోర్టును ఆశ్రయించగా, పిఏసీఎస్ పాత పాలకవర్గాన్ని కొనసాగించాలని తీర్పు రావడం హర్షించదగిన విషయమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్