యాదాద్రి హుండీ ఆదాయం వివరాలు

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. 36 రోజుల కానుకల లెక్కింపులో రూ. 2,48,53,666 నగదు, 64,500 మిల్లీ గ్రాముల మిశ్రమ బంగారం, 3 కేజీల మిశ్రమ వెండి స్వామి వారి ఖజానాకు చేరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్