యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక జయంతి మహోత్సవాలు వైభవంగా నాలుగో రోజు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం స్వామి వారికి అలంకరణ సేవ, యాగశాలలో ద్వార తోరణ పూజ, మూర్తి కుంభారాధన, చతుఃస్థానార్చన, లక్ష్మీ నృసింహ సుదర్శన, గరుడ, మూల మంత్ర హోమములు, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.