రామన్నపేటలో ఆదాని-అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనకై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత తెలిపినందున ఎసెన్షియల్ కమిటీకి వాస్తవికంగా నివేదిక పంపి పరిశ్రమ రాకుండా చూడాలని రామన్నపేట పర్యావరణ పరిరక్షణ వేదిక, అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జండగి కి కలక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రామన్నపేటలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపుగా 10వేల మంది పాల్గొన్నారని అన్నారు