అర్హులైన పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐ(ఎం) ఆలేరు మండల, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు.