విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్‌మెన్ మృతి

మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామ శివారులో గురువారం ఉదయం టీజీఎస్పీడీఎల్ అసిస్టెంట్ లైన్‌మెన్ ఒర్సు సురేష్ (33) విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. వ్యవసాయ బావి సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ను సరిచేస్తున్నప్పుడు, విద్యుత్ లైన్ క్లియర్ తీసుకోకుండా జంపర్లను కట్ చేసి పనిచేస్తున్న క్రమంలో, ట్రాన్స్‌ఫార్మర్‌కు బిగించిన ఎల్టీ వైరు హెవీ లైన్‌కు తాకడంతో ఈ దుర్ఘటన జరిగింది. అతన్ని చికిత్స కోసం భువనగిరికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు. తన పరిధిలో లేని గ్రామంలో పనిచేస్తూ మరణించడం పట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్