ఎఐటీయూసీ టీజీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం శనివారం రాష్ట్ర కార్యాలయం సత్యనారాయణరెడ్డి భవన్ హైదరాబాద్ లో యూసుఫ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఇమ్రాన్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యక్రమాల రిపోర్ట్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలను, 9న జరిగిన సమ్మె పై పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో 4 లేబర్ కోడ్ లు, కార్మికుల సమస్యలపై పోరాటాలు, ఏఐటీయూసీను బలోపేతం చేయడం కోసం పలు తీర్మానాలు చేశారని ఆయన తెలిపారు.