యాదాద్రి భువనగిరి జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ధనంజయేయులు తెలిపారు. ఆసక్తి ఉన్న సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, జాతీయ స్థాయి క్రీడాకారులు ఈనెల 18లోపు కలెక్టరేట్లోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే నెలాఖరు వరకు 12 నుంచి 14 సంవత్సరాల బాల, బాలికలకు పలు క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని, శిబిరాలు నిర్వహించేందుకు ఎంపికైన వారికి గౌరవవేతనం చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు.