భువనగిరి: కాంగ్రెస్, సిపిఐ కలిసి మునిసిపల్ ఎన్నికల్లో పోటీ

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డి, సిపిఐ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్త ఒప్పందంలో భాగంగా భువనగిరి, భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలలో కాంగ్రెస్-సిపిఐ కలిసి పోటీ చేస్తాయని, కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పాలనలో హెచ్ఎండిఏ కింద 56 కోట్ల నిధులు తెచ్చామని, అభివృద్ధి అంటే ఏంటో చూపించామని, బీఆర్ఎస్ హయాంలో జరగని అభివృద్ధి కాంగ్రెస్ చేస్తుందని అన్నారు. కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్