భువనగిరి ఎండీ ఇమ్రాన్ సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వలిగొండలోని సీపీఐ 4వ జిల్లా మహాసభలో గురువారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇమ్రాన్ గతంలో పట్టణ కార్యదర్శిగా, ఏఐటీయూసీ రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. తన ఎన్నికకు సహకరించిన నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.