భువనగిరి: చుక్కల్లో నిమ్మధర.. నెల రోజుల్లోనే రెట్టింపు

వేసవి ప్రభావంతో నిమ్మకాయలకు డిమాండ్ పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో క్వింటాల్ ధర రూ. 9 వేల నుంచి రూ. 10 వేల వరకు పలుకుతోంది, ఇది గత నెలలో రూ. 4 వేలుగా ఉంది. దిగుబడులు తగ్గడం, ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ పెరగడం దీనికి కారణమని వ్యాపారులు తెలిపారు. జిల్లా మార్కెట్ల నుంచి బయటకు వెళ్లే సరుకు తగ్గింది, ప్రస్తుతం రోజుకు ఒక లారీ మాత్రమే వెళ్తోంది.

సంబంధిత పోస్ట్