మేడే వారోత్సవాల సందర్భంగా, ఈనెల 7వ తేదీన భువనగిరిలో నిర్వహించనున్న భారీ ర్యాలీ మరియు బహిరంగ సభను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు. మంగళవారం భువనగిరి మార్కెట్ యార్డుల్లో హమాలీ కార్మికులతో కలిసి మే డే వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు.