భోనగిరి యాదాద్రి జిల్లా వంగపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, రామాజిపేట వద్ద ప్రభుత్వ గోదాములను రాష్ట్ర మంత్రులు కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్, లోకసభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసన సభ్యులు కుంభం అనిల్ రెడ్డి, వేముల వీరశం, పౌర సరఫరాల శాఖాకమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్, డి. సి. పి పాల్గొన్నారు.