యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని, భువనగిరిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలున్నాయని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని ఆయన కోరారు.