భువనగిరి: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 6, 7, 18వ వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గడప గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, గత పాలన లోపాలను ఎత్తిచూపారు. ప్రజాపాలన ద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు లభిస్తే పట్టణ అభివృద్ధి వేగవంతమవుతుందని, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్