యాదాద్రి భువనగిరి జిల్లా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. చౌటుప్పల్, నారాయణపురం, పోచంపల్లి బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. విచారణ పేరుతో కేసీఆర్‌ను వేధిస్తే తీవ్ర పరిణామాలుంటాయని కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తూ, సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.