చౌటుప్పల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్లో పాల్గొన్న లక్ష్మణ్

తెలంగాణ సంపదను రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోందని బీజేపీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పిందని, యువత ఉద్యోగాల కోసం తిరిగితే లాఠీఛార్జ్ చేయించిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ సాధనలో 1200 మంది యువత బలి అయితే, కాంగ్రెస్ నాయకులు భోగాలు అనుభవిస్తున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్