యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంకు చెందిన పలువురు యువకులు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఈడ్డుల విజయ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.