చౌటుప్పల్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కు రూ. 500కోట్లతో ప్రణాళిక

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం, చౌటుప్పల్ చెరువులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం పరిశీలించారు. మున్సిపాలిటీలోని చెరువు నిండినప్పుడు కాలనీలు జలమయం కాకుండా తీసుకోవలసిన చర్యలపై అధికారులతో చర్చించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధికి 500 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్