చౌటుప్పల్ పోలీసులు అక్రమంగా ఆవులను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ నుండి 10 ఆవులను అశోక్ లీలాండ్ వాహనంలో, వాటిపై ఉల్లిగడ్డ, కొబ్బరి బోండాల బస్తాలు వేసి హైదరాబాద్ కబేలాకు తరలిస్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పుష్ప సినిమా తరహాలో ఈ అక్రమ రవాణా జరిగినట్లు పోలీసులు గుర్తించారు.