చౌటుప్పల్: స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి

అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం అన్ని జిల్లా కేంద్రాలలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పల్లె మధుకృష్ణ గురువారం అన్నారు. చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో డివైఎఫ్ఐ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం యువతకు ఉపాధి అవకాశాల కోసం నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్