చౌటుప్పల్: పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం మూడో రోజు వాహనాల రద్దీ కొనసాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరగడంతో, మొత్తం 16 టోల్ బూత్ లకు గాను 11 బూత్ లను విజయవాడ వైపు అధికారులు తెరిచారు. నిమిషానికి 47 వాహనాలు వెళ్తున్నాయని, ఇప్పటివరకు 1,30,000 వాహనాలు వెళ్లినట్లు తెలిపారు. ఆదివారం మరియు వరుస సెలవుల కారణంగా ప్రజలు విహారయాత్రలకు వెళ్తుండడంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. రద్దీని నియంత్రించడానికి పోలీసులు, టోల్ ప్లాజా సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్