బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవానికి విరాళం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ మండలం పడమటి సోమారంలో ఈ నెలలో బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సర్పంచ్ అంజయ్య తెలిపారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఆల్వ నర్సింహ రెడ్డి రూ. 10,116 విరాళంగా శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రదీప్, కృష్ణ, యాదిరెడ్డి, బుచ్చిరెడ్డి, రవీందర్ రెడ్డి, భిక్షపతి, బసవయ్య, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మహోత్సవం కోసం విరాళాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕