ఉపసర్పంచుల హక్కుల కోసం ఎమ్మెల్యేను కలిసిన ఫోరం ప్రతినిధులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ఆదివారం యాదాద్రి ఉపసర్పంచ్ ల ఫోరం జిల్లా అధ్యక్షులు సుర్కంటి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధులు కలిశారు. ఉపసర్పంచుల హక్కుల పరిరక్షణకు సహకరించాలని, వారి చెక్ పవర్ రద్దుపై వస్తున్న వదంతులను అరికట్టాలని కోరారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి, గ్రామ అభివృద్ధికి సర్పంచ్, ఉపసర్పంచులు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ సమావేశం వలిగొండ ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు గొడ్డేటి సత్యం సమక్షంలో జరిగింది.

సంబంధిత పోస్ట్