రాయగిరిలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం

భువనగిరి నియోజకవర్గంలోని రాయగిరి పరిధిలో లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడి నిమజ్జన కార్యక్రమం శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. నిమజ్జనానికి ముందు గణపతికి ప్రత్యేక పూజలు, మంగళహారతులు సమర్పించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని దీపారాధనతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి ఉత్సాహంతో నిమజ్జన శోభాయాత్రను నిర్వహించారు. గణపతి నామస్మరణలు, భక్తిగీతాలతో పండుగ వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్

✕
✕