తాటి చెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్ లో శుక్రవారం కల్లు గీస్తున్న ఇట్టమోని పాండు అనే కార్మికుడు తాటి చెట్టు పైనుంచి కాలుజారి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని ఎడమ కన్ను నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది, చేతులు, కాళ్లకు కూడా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి ఎయిమ్స్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్