ప్రజా పాలన పట్టణ ప్రణాళికలో పాల్గొన్న ఎమ్మెల్యే

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ 22వ వార్డులో ప్రజా పాలన పట్టణ ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఆసరా పెన్షన్లు, రైతు భరోసా, భీమా పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రజలకు రేషన్ కార్డులు అందాయని ఎమ్మెల్యే గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్