మోటకొండూర్: గీత కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సాయం

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలం దిలావర్ పూర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు సీసా పండరి గౌడ్, వృత్తి నిర్వహణలో ఉండగా తాటి చెట్టుపై నుండి కిందపడి మృతి చెందాడు. మృతుడు కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్నాడు. వారి దయనీయ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (KANA) సంస్థ మృతుడి కుటుంబానికి రూ. 20,000 ఆర్థిక సహాయం అందజేసింది.

సంబంధిత పోస్ట్