కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ పిలుపునిచ్చారు. ఆదివారం మోత్కూర్ లోని కే. ఆర్ భవన్ లో ప్రజా సంఘాల ముఖ్య నాయకులు సమావేశంలో ఇమ్రాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులపైన, రైతుల పైన దాడి తీవ్రతరం చేసిందన్నారు.