యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. రహదారిపై ధాన్యం పోసి బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అలసత్వాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు ప్రక్రియలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారులను నిర్బంధం చేస్తామని హెచ్చరిక చేశారు.