రాజాపేట: బకాయి బిల్లుల కోసం పాడి రైతుల ఆందోళన

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలోని మదర్ డైరీ చిల్లింగ్ సెంటర్ వద్ద పాడి రైతులు నిరసన చేపట్టారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ, సెంటర్ గేటుకు తాళం వేసి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిల్లులు చెల్లించినట్లు చెబుతున్నప్పటికీ రైతుల ఖాతాల్లో నగదు జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్