విశ్రాంత ఉపాధ్యాయుడి ఆత్మహత్య

భువనగిరి పట్టణంలోని మీనానగర్లో నివాసం ఉంటున్న 70 ఏళ్ల విశ్రాంత ఉపాధ్యాయుడు రేఖల ఆనందం, ఆర్థిక, అనారోగ్య సమస్యలతో మనస్తాపం చెంది మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య తీర్థయాత్రలకు వెళ్లగా, ఒక కుమారుడు విదేశాల్లో ఉంటున్నారు. పెద్ద కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశ్రాంత ఉపాధ్యాయుల సంఘం నాయకుడిగా పనిచేస్తున్న ఆనందం, ప్రతిరోజూ సంఘం కార్యాలయంలో అందరితో కలిసి ఉండేవారని తోటివారు తెలిపారు.

సంబంధిత పోస్ట్