ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేస్తే, బీఆర్ఎస్ నేతలు ఆత్మగౌరవం పేరుతో రాద్ధాంతం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌కు తెలియకుండానే ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేయడం సాధ్యమేనా అని ఆయన ప్రశ్నించారు. ఎస్‌ఐబీలో సీసీ కెమెరాలను ఆపి, ఫైళ్లను ధ్వంసం చేసి మూసీ నదిలో, అడవుల్లో పడేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో 'పింకీలు' సమాధానం చెప్పాలని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.