యాదాద్రి: అక్రమ మద్యం అమ్మకాలు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలో మంగళవారం అక్రమ మద్యం విక్రయాలపై విశ్వసనీయ సమాచారం మేరకు చౌటుప్పల్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఊర కరుణాకర్ అనే వ్యక్తి కిరాణా దుకాణంలో 22 బీరు సీసాలు, 1 రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్, 3 సిగ్నేచర్ క్వార్టర్ సీసాలు, 2 రాయల్ స్టాగ్ క్వార్టర్ సీసాలు అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్