సూర్యాపేట జిల్లాలో కోదాడ, హుజూర్నగర్ తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాల్లో శుక్రవారం రాత్రి నుంచి ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పలు మండలాల్లో వర్షాలు కురుస్తున్నట్లు సమాచారం. వర్షాల ధాటికి ఆయా గ్రామాల్లోని చెరువులు నిండి అలుగులు పోస్తున్నాయి. గత వారం రోజులుగా పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ప్రమాదాలు జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.