యాదగిరిగుట్ట శ్రీ శ్రీ సుదర్శన లక్ష్మీనరసింహ స్వామి వారి దివ్య స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేక మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు యాదగిరిగుట్టలో దివ్య విమాన స్వర్ణ గోపుర మహా కుంభాభిషేక కార్యక్రమం జరగనుంది. దేవాదాయ శాఖ మంత్రి సురేఖ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌తో పాటు ఆలయ ఈవో, అర్చకులు సచివాలయంలో సీఎంను కలిసి ఈ మేరకు ఆహ్వానాన్ని అందజేశారు.