వింబుల్డన్ రెండో సెమీ ఫైనల్‌లో యానిక్ సినర్ అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. నోవాక్ జకోవిచ్‌ను వరుస సెట్లలో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెంటర్ కోర్టులో జొకోవిచ్‌ను సినర్ 6-3, 6-3, 6-3 తేడాతో ఓడించాడు. కేవలం గంటా 40 నిమిషాల సమయంలోనే యానిక్ ఆట ముగించాడు. ఇప్పటికే జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో గెలిచి ఫైనల్‌కు వెళ్లిన కార్లోస్ అల్కరాజ్‌ను యానిక్ సినర్ ఢీకొట్టనున్నారు.