ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే టీడీపీ కార్యకర్తలు చెలరేగిపోయారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. వైసీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. దాడుల కట్టడికి చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, ఇతర వైసీపీ నేతలు ఉన్నారు.