AP: వైసీపీ మావిగన్ నినాదాన్ని అందుకుని విశాఖ రాజధానిని పక్కన పెట్టడం ఉత్తరాంధ్రా అభివృద్ధిపై విమర్శలకు దారితీసింది. 2024 ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన కృష్ణా, గుంటూరు జిల్లాలలో పట్టు సాధించేందుకు వైసీపీ మావిగన్ నినాదాన్ని వాడుకుంటోందని అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులను ఆకట్టుకోవడానికి, గ్రేటర్ రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో బలం పెంచుకోవడానికి వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఉత్తరాంధ్రాలో బీసీ జనాభా అధికంగా ఉన్నందున, అక్కడికి కొత్త నినాదం, వ్యూహాలతో రావాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.