ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి డొనేట్ చేయనున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్‌లో కొద్ది వారాలుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. తన శరీరాన్ని విద్యార్థులకు ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో వైద్య పరిశోధనల నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి దానంగా ఇవ్వాలని గతంలో ఏచూరి కోరడం జరిగింది.