యోగా ఫర్ మోడీ కాదు.. యోగా ఫర్ బాడీ: మాజీ ఉప రాష్ట్రపతి

TG: నక్లేస్‌ రోడ్‌లో ఖేల్ ఇండియా, ఫిట్ ఇండియాలో భాగంగా నవ్ భారత్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రసంగించారు. దేశ యువత ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. “యోగా ఫర్ మోడీ కాదు, యోగా ఫర్ బాడీ. రోజూ ఆసనాలు, వ్యాయామం చేయాలి. రాగులు, జొన్నలు తినండి, డ్రగ్స్‌కి దూరంగా ఉండండి. సృజనాత్మకంగా ఉండి, మహిళలను సమానంగా భావించండి, కుటుంబానికి, తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వండి” అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్