అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏనుగులతో కలిసి అధికారులు యోగాసనాలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని జల్దపరా జాతీయ పార్కు పరిధిలోని హలోంగ్ నదీ తీరంలో అటవీ శాఖ సిబ్బంది, ఆరు కుంకీ ఏనుగులతో కలిసి వినూత్నంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. పచ్చని ప్రకృతి అందాల నడుమ ఏనుగులు, అధికారులు కలిసి చేసిన ఈ యోగా దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి.