యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి’ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిరాకరించింది. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. దీనిపై దర్శక నిర్మాతలు బాంబే కోర్టును ఆశ్రయించారు. యోగి ఆదిత్యనాథ్ పేరును ఈ సినిమాలో అజయ్ మోహన్‌సింగ్‌గా మార్చారు. యోగీ ఆదిత్యనాథ్ పాత్రలో అనంత్ జోషి నటించారు. దీనిపై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది.