ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటేనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఇద్దరూ దర్గాలు కూల్చుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలకు ముస్లింలంటే ద్వేషం ఉందని, వారి మధ్య తేడా లేదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.